చల్ చల్ గుర్రం వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ హీరో హీరోయిన్లుగా మోహన్ ప్రసాద్ దర్శకత్వంలో ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాఘవయ్య నిర్మించిన చిత్రం ‘చల్ చల్ గుర్రం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేస్తున్నాం. కొత్త కానె్సప్టుతో యంగ్ టీమ్‌తో చేసిన సినిమా ఇది. టైటిల్‌కు అనుగుణంగానే ఫన్ అండ్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. నిర్మాత రాఘవయ్య సహకారంతో సినిమా అనుకున్నట్టుగా రూపొందించాం. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేసింగుల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకున్న శైలేష్, ‘ముకుంద’ సినిమా తరువాత చేసిన చిత్రమిది. తన పాత్రలో ఒదిగిపోయి చక్కగా నటించారు. సినిమాలో 36 పాత్రలు వున్నాయి. పాత్రకు పాత్రకు మధ్య ఎలాంటి బ్లడ్ రిలేషన్ వుండదు. ఇది తెలుగు తెరపై కొత్త ప్రయోగమని చెప్పాలి. హీరోయిన్లు అంగన, దీక్ష అద్భుతంగా నటించారు’ అన్నారు. హీరో శైలేష్ మాట్లాడుతూ, ‘ముకుంద’ సినిమా తరువాత దర్శకుడు మోహన్ ప్రసాద్ చెప్పిన ఈకథ బాగా నచ్చిందని, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వున్న సినిమా ఇదని, వెంగీ ఇచ్చిన మ్యూజిక్ హిట్‌గా నిలిచిందని, తప్పకుండా ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్లు మాట్లాడుతూ- ఇందులో మంచి పాత్ర చేశామని, ముఖ్యంగా దర్శకుడు కథను తీసుకెళ్లిన విధానం అద్భుతంగా వుందని, హీరో శైలేష్ పాత్రలో ఒదిగిపోయి నటించాడని, ముఖ్యంగా టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్‌తో చేసిన సినిమా ఇది అని అన్నారు. సంగీత దర్శకుడు వెంగీ మాట్లాడుతూ- ఆడియోను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలని, దర్శక నిర్మాతలు ఇచ్చిన సహకారం మరువలేనిది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:వెంగీ, ఎడిటింగ్:శంకర్, కెమెరా:శ్యాంప్రసాద్.వి., నిర్మాత:రాఘవయ్య, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:మోహన్ ప్రసాద్.