త్రివిక్రమ్‌తో కొత్త సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి వరుస సినిమాలతో ఆకట్టుకోవడానికి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 151వ చిత్రంలో బోయపాటి దర్శకత్వంలో సినిమా వుంటుందని వార్తలొస్తున్నాయి. దాంతోపాటు 152వ చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి 152వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని తెలిసింది. ఇప్పటికే ఈ వార్తకు సంబంధించిన సమాచారం జోరుగా ప్రచారంలో వుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అటు బోయపాటి శ్రీనుతో ఇటు త్రివిక్రమ్‌తో చిరంజీవి జోరుగా చర్చలు జరుపుతున్నట్టు మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దాంతో చిరంజీవి వరుసగా క్రేజీ దర్శకులతో పనిచేస్తుండడంతో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది.