జోరుమీదున్న భాగమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై హీరోలకు ధీటుగా బాక్సాఫీస్‌వద్ద లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తాచాటిన అనుష్క, ‘బాహుబలి’ సినిమాతో మరింత ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘బాహుబలి-2’లో నటిస్తున్న ఈమె, మరోవైపు ‘్భగమతి’ చిత్రంలో నటిస్తోంది. ‘పిల్లజమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్‌లు నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మళ్లీ అనుష్క తన సత్తాను చాటుతుందని యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా అనుష్క నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా కానుందని సమాచారం. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది.