బ్రహ్మోత్సవం టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌ను శుక్రవారం మహేష్‌బాబు తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఆర్‌ఎఫ్‌సిలో భారీ సెట్స్‌లో ఈనెల 5 నుండి షూటింగ్ జరగనుందని, నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశామని తెలిపారు. అన్ని హంగులతో రూపొందిస్తున్న ఈ చిత్రం తమ అభిమానులతోపాటుగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మహేష్‌బాబు అన్నారు. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణ్భగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిరి చౌదిర ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.రత్నవేలు, సంగీతం:మిక్కి జె మేయర్, నిర్మాతలు:పెరల్ వి.పొట్లూరి, పరం వీర్ పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీకాంత్ అడ్డాల.