రవిబాబు దర్శకత్వంలో పెళ్లిచూపులు హీరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకుని, ఆ తరువాత దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. కొత్త ప్రయత్నాలతో సినిమాలు చేస్తూ షాక్ ఇస్తున్న ఆయన, ప్రస్తుతం ఓ పందిపిల్ల నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తికావచ్చిన ఈ సినిమా, రాజవౌళి ఈగతో సినిమా చేస్తే.. నేను పందితో తీయలేనా అనే శైలిలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన ‘పెళ్లిచూపులు’ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. రవిబాబు సినిమా అంటే ఏదో కొత్తగా వుంటుందనే నమ్మకం జనాల్లో వుంది. కాబట్టి మరి ఈ ‘పెళ్లిచూపులు’ హీరోతో ఆయన ఎలాంటి ప్రయత్నం చేయనున్నాడో అన్నది ఆసక్తికరంగా మారింది. పెళ్లిచూపులు హిట్‌తో ఇండస్ట్రీలోకి క్రేజీ హీరోగా మారిన విజయ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక రవిబాబు, విజయ్‌లతో రూపొందే చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ నిర్మిస్తున్నాడు.