మలయాళంలో అల్లు శిరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. మోహన్‌లాల్‌తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. అది కూడా ఓ యూనివర్సల్ సబ్జెక్ట్ ద్వారా... ఓ మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని శిరీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ కథానాయకుడిగా ‘1971 బియాండ్ బోర్డర్స్’ అనే చిత్రం రూపొందించనున్నాడు. ఈ చిత్రంలోనే అల్లు శిరీష్ ట్యాంక్ కమాండర్‌గా కీలక రోల్ ప్లే చేయనున్నాడు. క్రేజీ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. మోహన్‌లాల్‌తో కలిసి నటించే అవకాశం తొలి సినిమాకే రావడం అదృష్టంగా భావిస్తున్నానని, మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు ఇదే సరైన సబ్జెక్ట్ అని భావిస్తున్నామన్నారు. ‘1971 బియాండ్ బోర్డర్స్’ పేరుతో రూపొందించబోయే ఈ చిత్రంలో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్‌లెంగ్త్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నానని, ఈ చిత్ర కథ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రూపొందించట్లేదని, హ్యూమన్ డ్రామా, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం ప్రతీ భారతీయుడు గర్వపడే రీతిలో ఉంటుందని అన్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకానుంది అని అన్నారు.