పూరితో ఎన్టీఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతా గ్యారేజ్ తరువాత ఆ రేంజ్ హిట్ సినిమా కోసం గట్టి ప్రయత్నాలే చేసాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్‌తో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ త్రివిక్రమ్ పవన్‌తో సినిమా చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి.. అది వర్కవుట్ అయ్యేలా లేదు. ఇక వక్కంతం వంశీ సినిమా ఎలాగూ క్యాన్సిల్ అయింది. ఇటీవలే ‘పటాస్’ ఫేమ్.. అనిల్ రావిపూడితో కూడా సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి కానీ దానికి ఇంకా టైం పట్టేలా వుంది.
ఈలోగా ఇప్పటికే పూరి జగన్నాథ్‌తో చర్చలు కూడా జరిపిన ఎన్టీఆర్ ఫైనల్‌గా ఆయనతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడని తెలిసింది. కల్యాణ్‌రామ్‌తో తీసిన ‘ఇజం’ సినిమా నినే్న విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో పూరితో సినిమా చేయడమే ఇప్పుడు బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట! సో త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం వుంది.