వచ్చే నెలలో ఒక్కడొచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా కాంబినేషన్‌లో హరి వేంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత జి.హరి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 18న విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ ‘ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, ఒక్క రోజులోనే తెలుగు, తమిళ భాషల్లో ఈ టీజర్‌కు 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని, విశాల్ కెరీర్‌లోనే ‘ఒక్కడొచ్చాడు’ డిఫరెంట్ మూవీ అవుతుందని అన్నారు. యాక్షన్ వుంటూనే మంచి మెసేజ్‌తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇదని, ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తీశామని, సినిమాకి అవి చాలా పెద్ద హైలెట్‌గా అవుతాయని అన్నారు. నవంబర్ మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేసి, నవంబర్ 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, విశాల్‌కి మరో సూపర్ హిట్ సినిమా అవుతుందని అన్నారు. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, పాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మి, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, డాన్స్: దినేష్, శోభి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.