సుకుమార్ ఫార్ములా ఎక్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వరలోనే ఓ క్రేజీ కాంబినేషన్‌కు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘ధ్రువ’ చిత్రాన్ని చేస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందే సినిమా సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తికావచ్చింది. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితం అయ్యే ఈ సినిమా గురించి ప్రస్తుతం మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రేమకథలను కొత్తగా చూపే సుకుమార్ ఈసారి చరణ్‌కోసం కూడా మరో ప్రేమకథను రెడీ చేశాడట. అయితే ఈసారి పట్నాన్ని వదిలి అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా వుంటుందని తెలిపింది. ఈ సినిమాకు టైటిల్ ‘్ఫర్ములా ఎక్స్’ అని పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రేమకథ 90వ దశకంలో జరిగిన కథగా తెరకెక్కుతుందట. అంటే అప్పుడు ఇంకా సెల్‌ఫోన్స్ కూడా లేని రోజుల్లో నడిచే ప్రేమకథ అన్నమాట. ప్రస్తుతం ధ్రువ సినిమా దాదాపు పూర్తిఅయింది కాబట్టి వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.