కర్నాటకలో ప్రేమభిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్, శృతిలయ హీరో హీరోయిన్లుగా, ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్థ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారుచేశారని, సగానికిపైగా టాకీపార్ట్ పూర్తయిన ఈ చిత్రంయొక్క పూర్తి టాకీ ఈనెల 25 వరకు కోలార్‌లో జరుగుతున్న షెడ్యూల్‌తో కంప్లీట్ అవుతుందని అన్నారు. దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ, సుమన్ పాత్ర హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో నవంబర్ ప్రథమార్థంలో ఆవిష్కరిస్తామని అన్నారు.