దిల్ రాజు సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం ‘ప్రేమమ్’ మంచి విజయం సాధించడంతో ఆయన ప్రాజెక్టులపై నిర్మాతల్లోనూ, డిస్ట్రిబ్యూటర్లలోనూ నమ్మకం బాగా పెరిగింది. ‘ప్రేమమ్’లో చైతూ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా మెప్పించడంతో ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులకే కాకుండా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీగా వున్న సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాల్లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం రిలీజ్‌కి రెడీగా వుంది. ఈ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కైవసం చేసుకున్నాడు. ‘ప్రేమమ్’ తర్వాత చైతన్య క్రేజ్ బాగా పెరగడం, మార్కెట్ కూడా బాగుండడంతో ఈ సినిమాను దిల్ రాజు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. తమిళ వర్షెన్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’కు ‘ప్రేమమ్’ విజయం చాలా బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంజిమా మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.