కొత్త ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళీ గ్లామర్ భామ కేథరీన్ ట్రెస్సా కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత పలు తెలుగు చిత్రాల్లో నటించినా కూడా పెద్దగా లాభం లేకుండా పోయింది. గ్లామర్‌తో ఎంతగా ఆకట్టుకోవాలనుకున్నా, ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామకు అక్కడ నిరాశే మిగిలింది. మళ్లీ తెలుగులోనే నిలబడాలనే ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. దాంతోపాటు విశాల్ సరసన కథాకళి చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కొత్త సంవత్సరంలో విడుదలవుతున్నాయి. కనీసం ఈ ఏడాదైనా తనకు మంచి హిట్స్ దక్కుతాయనే ఆశతో ఉంది కేథరీన్.