ప్రేమ..స్నేహం గురించి చెప్పే స్పీడున్నోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలిచిత్రం ‘అల్లుడు శీను’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘స్పీడున్నోడు’. గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సునీత రూపొందిస్తున్న ఈ చిత్రం గూర్చి హీరో శ్రీనివాస్ నేడు తన పుట్టినరోజు సందర్భంగా పలు విశేషాలను తెలిపారు.
బర్త్‌డే స్పెషల్ ఏం లేదు
ఈ పుట్టినరోజుకు పెద్దగా కొత్త ఆలోచనలు ఏమీ లేవు. స్నేహితులతో కలిసి సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తాను. బైటకు ఎక్కడికీ వెళ్లడంలేదు. అంతా డైరెక్టర్ ఇష్టమే. డైరెక్టర్‌కు ఎస్ సెంటిమెంట్ ఏమోగానీ, ఈ సినిమా పేరును కూడా ఆయన ఛాయిస్‌గానే నిర్ణయించాం. ‘స్పీడున్నోడు’ ఫ్రెండ్‌షిప్ గురించి, ప్రేమ గురించి, కుటుంబ విలువల గురించి చెబుతాడు.
చాలా మార్పులు జరిగాయి
తమిళ సినిమా సుందర పాండ్యన్ సినిమా ఆధారంగా తీసుకున్నామంతే. తెలుగు క్లైమాక్స్ మిగతా అన్ని సన్నివేశాలు మన నేటివిటికీ తగిన విధంగా మార్పులు చేశాం. రెండు పాటలు, మరో రెండు రోజుల ప్యాచ్‌వర్క్ మినహా సినిమా అంతా పూర్తయింది. చిత్రీకరణతోపాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈసినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈనెల 16న ఆడియో విడుదల వుంటుంది.
నా పాత్ర
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నా పాత్రకు నటించే అవకాశం బాగా వుంది. ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కనుక నా బాడీ లాంగ్వేజ్‌ను చాలావరకూ మార్చుకుని అనేక జాగ్రత్తలు తీసుకున్నాను. అన్ని విషయాల్లో కేర్ తీసుకుని నటించే ప్రయత్నం చేశాను. ‘అల్లుడు శీను’ సినిమాకు ఏ మాత్రం తగ్గని విధంగా ఫైట్లు, డాన్సులు ఉంటాయి. ఆ సినిమాకన్నా పది రెట్లు కష్టపడ్డాను.
అందుకే సెలెక్టివ్‌గా..
మంచి సినిమాలు చేయాలని వుంది. రెండు మూడు సినిమాలు సెలెక్టివ్‌గా వుండాలనుకుంటున్నాం. తరువాత నుండి ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే ఆలోచన కూడా వుంది.
బోయపాటి సినిమా
నా రెండో చిత్రం బోయపాటితో చేయాల్సింది. కానీ అంతకన్నా ముందు బన్నీ-బోయపాటి సినిమా చేయాలనుకున్నారు. బన్నీ ఆరునెలలపాటు బిజీగా వుండడంతో ఆ గ్యాప్‌తో నాతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కథ సంతృప్తిగా రాక ఆగిపోయాం. ఏప్రిల్ 8 నుండి బోయపాటి సినిమా వుంటుంది. అభిషేక్ పిక్చర్స్‌వారు ఈ సినిమా రూపొందిస్తున్నారు. మార్చిలో షూటింగ్ పెడతాం.
తరువాత ప్రాజెక్టులు
బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం, విజయకుమార్ కొండ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుంది.

-యు