త్రివిక్రమ్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్ విడుదల కానుంది. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఎబిసి డిజిటల్ మీడియా వారు తెలుగు పరిశ్రమలో తొలిసారిగా ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్‌ను వారు రూపొందించారు. అది సోమవారం విడుదల కానుంది. అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన దర్శకుడు త్రివిక్రమ్‌కు జన్మదిన కానుకగా ఈ యాప్ విడుదల కానుంది. ఒకే ఒక్క క్లిక్‌తో ఆయన చిత్రాలకు సంబంధించిన అన్ని తాజా విశేషాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వారు తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్స్ నుండి ఈ యాండ్రాయిడ్ అప్లికేషన్‌ను నేటినుంచి డౌన్‌లోడ్ చేయవచ్చని, యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా రూపొందించిన ఇందులో అన్ని అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మెసేజ్‌ల ద్వారా అభిమానులకు అందడమే ఇందులో విశేషమని సంస్థ ప్రతినిధి రాహుల్ తెలిపారు.