టీజర్‌తో వస్తున్న సింగం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా రూపొందిస్తున్న చిత్రం సింగం-3. ఈ చిత్రాన్ని సుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో భారీ అంచనాలు నెలకొన్నాయని, సింగం చిత్రాలకు ఎంత స్థాయి వుందో అంతకన్నా భారీ స్థాయి ఈ చిత్రానికి దక్కుతుందని నిర్మాత తెలిపారు. సూర్య సరసన అనుష్క, శ్రుతిహాసన్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. సూర్య, అనుష్కలపై చిత్రీకరించే పాటలు విదేశాల్లో చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తవుతుందని, ఆడియోను ఈనెలలోనే విడుదల చేసి డిసెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా వుండే నేపథ్యంతో ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమా రూపొందిందని, వైజాగ్‌లో ప్రారంభమైన షూటింగ్, హైదరాబాద్ షెడ్యూల్‌తో పూర్తిచేశామని ఆయన అన్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:హారిస్ జయరాజ్, దర్శకత్వం:హరి.