అనుపమకు లక్కీచాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుపమ పరమేశ్వరన్ ‘అ ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరు. ఆ సినిమాలో అనుపమ నెగెటివ్ కేరెక్టర్‌లో కనిపించింది. ‘అ ఆ’ సినిమాలో అనుపమ నితిన్‌ని గాఢంగా ప్రేమించే పాత్ర చేసి అందరినీ అలరించింది. మళ్లీ వెంటనే నాగచైతన్య పక్కన ఒక రోల్‌లో ప్రేమమ్ చిత్రంలో చేసింది. ఈ సినిమాలో అనుపమకి పెద్ద స్కోప్ వున్న పాత్ర పడలేదు. ఇక ఈ సినిమాల తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజి అయ్యింది. అయితే అనుపమని టాలీవుడ్‌కి పరిచయం చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం అ ఆ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రని అనుపమకి ఇవ్వలేకపోయాడట. ఇక ఈ విషయంలో అనుపమ పరమేశ్వరన్ కొంచెం అలిగినట్లు వార్తలొచ్చాయి.
ఇక ఇప్పుడు పవన్‌తో త్రివిక్రమ్ ఒక సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో పవన్‌కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్‌ని త్రివిక్రమ్ సెలెక్ట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అందులో ఒక హీరోయిన్‌గా అనుపమని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి.
అనుపమలో వున్న టాలెంట్‌ను పూర్తి స్థాయిలో బయటపెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని.. అందుకే తన ఈ సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాకపోతే మెయిన్ హీరోయిన్‌గా అనుపమని తీసుకుంటాడా.. లేక మళ్లీ సెకెండ్ హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తాడా అనేది తెలియాల్సి వుంది.
ఒకవేళ నిజంగానే త్రివిక్రమ్ గనక అనుపమకి పవన్ పక్కన ఛాన్స్ ఇస్తే అనుపమ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లే.