18న చిన్నవాడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ నటించిన చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’. ఈ చిత్రంలో నిఖిల్‌కి జంటగా హెబాపటేల్, నందిత శే్వతలు హీరోయిన్లగా నటిస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. మేఘన ఆర్ట్స్ నిర్మాణంలో మేఘన ఆర్ట్స్ బ్యానర్‌లో డిఫరెంట్ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఆడియోని ఈవారమే విడుదలచేసి నవంబర్ 18న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ..‘మేఘన ఆర్ట్స్ బ్యానర్‌లో డిఫరెంట్ కానె్సప్ట్‌తో ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రాన్ని చేశాం. మా టీజర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రస్టింగ్‌గా వుందని చెప్తున్నారు. మా చిత్రం కూడా ఆ రేంజి ఇంట్రెస్ట్‌ని కలిగిస్తుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యుఏ సర్ట్ఫికెట్‌తో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 18న విడుదల చేస్తున్నాం. శేఖర్‌చంద్ర అందించిన ఆడియో ఈవారమే విడుదల చేస్తాం. ఆద్యంతం నవ్వించడమే కాకుండా సూపర్ థ్రిల్ వుంటుంది. హెబాపటేల్, నందితాశే్వత ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఇంకా వెనె్నలకిషోర్ చాలా బాగా నవ్వించాడు. నా గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అందరిని ఆకట్టుకుంటుంది.’ అని అన్నారు.
దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రానికి సంబంధించిన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియోని అతి త్వరలో విడుదలచేసి, చిత్రాన్ని నవంబర్ 18న విడుదల చేస్తున్నామని అన్నారు.