శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజిత్, షామిలి, నిషా ప్రధాన తారాగణంగా వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్ వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాట ఇటీవల విడుదలయ్యాయి. సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రభాత్ వర్మ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని హీరో సునీల్ ‘సీతారామయ్య మనవరాలి’తో పోల్చారని, సినిమా మొదటినుండీ చివరిదాకా చాలా ఆహ్లాదకరంగా వుంటూ ప్రేక్షకులకు నచ్చేలా సాగుతుందని, ఓ మంచి సినిమాని అందించాలన్న కృతనిశ్చయంతో రూపొందించామని తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, టైటిల్‌కు తగిన విధంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, యూనిట్ సభ్యులంతా ఈ చిత్రం విజయవంతం అవ్వాలన్న కోరికతో పనిచేశారని దర్శకుడు రాము తెలిపారు. విజయ్‌కుమార్, షఫి, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీవిశ్వనాధ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: కేదార్‌నాధ్, సంగీతం:సాబూ వర్గిస్, కెమెరా: ఎస్.మురళీమోహన్ రెడ్డి, నిర్మాత: ప్రభాత్ వర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.