అందరికీ నచ్చే పిజ్జా-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా ఆర్.పి.ఎ క్రియేషన్స్, డి.వి. సినీ క్రియేషన్స్ పతాకాలతో తెలుగు, తమిళ భాషల్లో రంజిత్ జయకోడి దర్శకత్వంలో నిర్మాత డి.వెంకటేష్ అందిస్తున్న చిత్రం ‘పిజ్జా-2’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈనెల 11న థియేటర్ ట్రైలర్, 14న ఆడియోను విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- ఆధునిక టెక్నాలజీతో కొందరు యువకులు అమాయకమైన మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపే ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా నిర్మించామని, ఏడు హిట్‌లతో టాప్‌స్టార్‌గా వెలుగుతున్న విజయ్ సేతుపతి ఎనిమిదవ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని తెలిపారు. తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని, ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఈ చిత్రం స్క్రీన్‌ప్లేతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిందని దర్శకుడు రంజిత్ జయకోడి తెలిపారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో రమేష్ తిలకన్, సోనియా దీప్తి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం:శ్యామ్.సి.ఎస్, కెమెరా:దినేష్ కృష్ణన్, ఎడిటింగ్:్భవన సి.కుమార్, నిర్మాత:డి.వెంకటేష్, దర్శకత్వం:రంజిత్ జయకోడి.