పాటలతో ఒక్కడొచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రాన్ని ఈనెల 18న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని నిర్మాత రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ- ‘కత్తిసండై’ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నామని, లవ్, యాక్షన్, కామెడీతో సహా అన్ని ఎలిమెంట్లు ఈ చిత్రంలో ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని, దాదాపు ఐదేళ్ల తరువాత వడివేలు ఈ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారని తెలిపారు. తమన్నాతో తాను కలిసి తొలిసారిగా ఈ చిత్రంలో నటించడం సంతోషమని, సురాజ్ తొలి చిత్రమైనా ఇగోలు ఏమీ పెట్టుకోకుండా అందరి సలహాలు వింటూ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు. సమాజంలో ప్రతి మనిషి మైండ్‌కు ఓ వాయిస్ వుంటుందని, ఆ వాయిస్‌తోనే ఈ సినిమాలో మాట్లాడే అవకాశం వచ్చిందని, అదేంటి అంటే ఈ సినిమా చూడాలని ఆయన అన్నారు. ఎంటర్‌టైన్‌తో కూడుకున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో ప్రేక్షకులకు ఓ సందేశం కూడా వుంటుందని, తమన్నా నటనలో, డాన్సులో తనేంటో నిరూపిస్తుందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలని దర్శకుడు సురాజ్ తెలిపారు. కార్యక్రమంలో తమన్నా, రచయిత రాజేష్, చల్లా భాగ్యలక్ష్మి, సి.కల్యాణ్, మెహరీన్, ప్రసన్నకుమార్, జయప్రకాష్ తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు. జగపతిబాబు, సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ తదితరులు నటించారు.