పృథ్వీదత్తా.. ఓ పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీస్ పతాకంపై అల్లు వంశ్, ప్రియాంక అగస్త్యన్ జంటగా పృధ్వీదత్తా రూపొందిస్తున్న చిత్రం ‘పృధ్వీదత్తా.. ఓ పరిచయం’. టాకీపార్ట్ పూర్తిచేసిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత పృధ్వీదత్తా మాట్లాడుతూ ఓ అందమైన రొమాంటిక్ కథతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి పాటా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, కెమెరా పనితనం హైలెట్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఈనెల 5న పూర్తవుతాయని, సెన్సార్ కార్యక్రమాలకు పంపుతున్నామని, అనంతరం విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. తమ సంస్థకు మంచి పేరు తెచ్చేలా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని, అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందించామని తెలిపారు. అనిరుధ్ తాళ్ళూరి, శిరీషా ఆదిమల్ల అశోక్, వెంకి, సరోజ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నాగిరెడ్డి, కథ, మాటలు, నిర్మాత, దర్శకత్వం:పృధ్వీదత్తా చింతల.