శాతకర్ణి జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నటుడు బాలకృష్ణ ప్రారంభించారు. 41 రోజులపాటు భారతదేశంలోని వంద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో 100కేజీల కుంకుమార్చనతోపాటు 23 శివలింగాలకు రుద్రాభిషేక, సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ జైత్రయాత్రకు నందమూరి అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని బాలకృష్ణ ఇంటిలో ప్రారంభమైంది. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.