సక్కనోడు చిక్కినా అందమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలక్ష్మి వెంకటరమణ మూవీస్ పతాకంపై శ్రీరామ్ దర్శకత్వంలో లీలా కార్తీక్, స్వప్న హీరో హీరోయిన్లుగా యు.ఎస్.రామచంద్రరావు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సక్కనోడు చిక్కినా అందమే’. దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ నేటి ట్రెండ్‌కి తగ్గ లవ్‌స్టోరీతో యూత్‌నే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఆకట్టుకునే సబ్జెక్ట్ ఇది. కిషన్ కవాడియా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. మంచి అభినయం ప్రదర్శించగల నటీనటులు ఈ చిత్రానికి దొరకడం ఆనందంగా వుంది అన్నారు.
నిర్మాత యు.ఎస్.రామచంద్రరావు మాట్లాడుతూ- దర్శకుడు శ్రీరామ్ మంచి ఫ్యామిలీ నేపథ్యం ఉన్న కథని వినిపించారు. కథ ఎంతగానో నచ్చింది. శరవేగంగా చిత్రీకరణ జరిపి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము అన్నారు. లీలా కార్తీక్, స్వప్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు:బోడిరెడ్డి సాయికుమార్, సంగీతం:కిషన్ కవాడియా, కెమెరా:పి.వనిదర్‌రెడ్డి, ఎడిటింగ్:వి.నాగిరెడ్డి, దర్శకత్వం:శ్రీరామ్ బి.ఎస్.సి.