కళ్యాణ వైభోగమే ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, మాళవికానాయర్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదరప్రసాద్ రూపొందించిన తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. బిగ్ సీడీని, ఆడియో సీడీని హీరో రామ్ విడుదల చేసి తొలి కాపీని మరో హీరో సుమంత్ అశ్విన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత దాము మాట్లాడుతూ తాను చేసే ప్రతి చిత్రంలో కొత్తవాళ్లను పరిచయం చేస్తుంటానని, ఈ సినిమా ద్వారా రాజు అనే కెమెరామెన్‌ను పరిచయం చేస్తున్నామని, సినిమా విజువల్‌గా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం అందించిన కళ్యాణ్ కోడూరికి మంచి గుర్తింపు వస్తుందని, తాను రాసుకున్న కథలు నిర్మాత దాముకు, స్వప్నాదత్తులకే అర్థమవుతాయని, ఆ విధంగా తనను నమ్మి ఈ చిత్రాన్ని నా చేతిలోపెట్టినందుకు కృతజ్ఞతలని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, ఈ సంస్థలో పనిచేయడం ఇది నాలుగోసారి అని, తప్పక పెద్ద హిట్ అవుతుందని సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి తెలిపారు. ఈ సినిమాలో తనను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారని, మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు కళ్యాణ్ కోడూరి పాటలు వింటే రీఛార్జ్ అవుతామని, దర్శకురాలు, నిర్మాత ఫ్యాషనేట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారని హీరో నాగశౌర్య తెలిపారు. కార్యక్రమంలో దశరథ్, ఇంద్రగంటి మోహనకృష్ణ, అవసరాల శ్రీనివాస్, జీవిత రాజశేఖర్, మాళవిక నాయర్, ప్రగతి, రాశి, ఐశ్వర్య, రాజ్‌తరుణ్, ప్రభు, కొండేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.వి.ఎస్.రాజు, మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినీరెడ్డి.