దెయ్యం ఇప్పుడు రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఛత్రపతి ప్రసాద్ రూపొందించిన ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ నేడు విడుదల కావలసి వుంది. కానీ ఈ చిత్రం విడుదలను వాయిదావేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- శుక్రవారం విడుదలకావలసిన ఈ చిత్రం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కృతిక, వౌర్యాని కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్‌చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్‌రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:సాయికార్తీక్, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు:డైమండ్ రత్నబాబు, పాటలు:్భస్కరభట్ల, నిర్మాత:బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.