సీక్వెల్‌లో రఘువరన్ బి.టెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ నటుడు ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బి.టెక్ తెలుగులో విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లో ఘనవిజయాన్ని సాధించడంతో, దానికి సీక్వెల్‌గా వి.ఐ.పి-2 పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మిస్తున్నారు. సౌందర్య గ్రాఫిక్ డిజైనర్‌గా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుని ఆమధ్య రజనీతో ‘కొచ్చడయాన్’ చిత్రంలో దర్శకురాలిగా మారింది. ఆమె దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రమిది. బి.టెక్ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకంటే గొప్పగా సీక్వెల్ వుంటుందని, తప్పకుండా దాన్ని మించిన విజయాన్ని అందుకునేలా రూపొందిస్తామని సౌందర్య తెలిపారు.