యూరప్‌లో ఖైదీ 150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి కథానాయకుడిగా రూపొందిస్తున్న ఖైదీ నెం.150 (బాస్ ఈజ్ బ్యాక్) చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగనుంది. సంక్రాంతికి విడుదల చేయడానికి జెట్ స్పీడ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాజల్ కథానాయికగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రస్తుతం యూరప్‌లో పాటల చిత్రీకరణకు యూనిట్ సిద్ధమవుతోందని, స్లోవేనియా, క్రొయేషియా (సెంట్రల్ యూరప్) లాంటి అరుదైన దేశాలలో రెండు పాటలను చిత్రీకరించనున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరిలో సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:రత్నవేలు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్:తోట తరణి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.