సంక్రాంతి బరిలో గురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గురు’. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘సాల ఖుద్దూస్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ విడుదలకు ఫిక్స్ అయింది. దాంతోపాటు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాలకు పోటీగా వెంకటేష్ గురు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే వైజాగ్‌లో ఓ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమా డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తిచేసుకోనుంది. యాక్షన్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నాడు వెంకటేష్. మరి సంక్రాంతి బరిలో జరిగే పందెంలో గురుడు విజయం సాధిస్తాడేమో చూడాలి!