కథే బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృతిక్ రోషన్ కథానాయకుడిగా భారీ యాక్షన్ థ్రిల్లర్ కాబిల్ చిత్రాన్ని తెలుగులో ‘బలం’గా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. రాకేష్ రోషన్ నేతృత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యామీగౌతమ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఒక వినూత్నమైన యాక్షన్ డ్రామాలో అంతర్లీనంగా వుండే ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందిందని, కథే బలంగా వుంటుందని తెలిపారు. హిందీ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 48 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ వచ్చాయని, బలంపై అంచనాలు ఎలా వున్నాయో తెలుస్తోందని, ఆంధ్ర, నైజాం హక్కులను రాజశ్రీ సంస్థ దక్కించుకోగా, కర్నాటక హక్కులను యశ్‌రాజ్ సంస్థ దక్కించుకుందని ఆయన అన్నారు. సంజయ్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న విడుదలకు సిద్ధమవుతోందని ఆయన తెలిపారు.