గ్రామీణ నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరం, తాన్యారెడ్డి ముఖ్య పాత్రల్లో ప్రణీత్ పండగ దర్శకత్వంలో గీతా టాకీస్ పతాకంపై వైష్ణవి నిరంజన్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో,హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు చలపతిరావు క్లాప్ కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,‘కొత్త పాయింట్‌తో వచ్చే చిత్రాల్ని జనాలు ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారు. హీరో వరం మాట్లాడుతూ- ‘తప్పకుండా అందరూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా..’ అన్నారు. దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ- ‘జయం చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాను. తర్వాత పలు చిత్రాల్లో నటించాను. పాత, కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండు పాత్రలు కథను నడిపిస్తాయి. ఇద్దరు ప్రముఖ నటులు నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం చిక్‌మగళూరు, వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చిపెడుతుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహేష్ ధీర, కెమెరా: రాహుల్‌మాచినేని, డాన్స్: పాల్, సమర్పణ: పరమ గీత, నిర్మాత: వైష్ణవి నిరంజన్, దర్శకత్వం: ప్రణీత్ పండగ.