కాటమరాయుడి విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రేక్ పడింది. దానికి కారణం పవన్ ఇటీవలే అనంతపురం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతోపాటు గుత్తిలో కాలేజీ విద్యార్థులతో సమావేశమయ్యాడు. 2019లో జరగబోయే ఎన్నికలకోసం జనసేన పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళేందుకు గట్టిగానే కృషి చేస్తున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా వుంటూ, మరోవైపు సినిమాలు చేయాలని ప్లాన్ చేశాడు. అందుకే ‘కాటమరాయుడు’ సినిమాకి సెలవుపెట్టి మరీ రాజకీయ సభల్లో పాల్గొంటున్నాడట. దాంతో కాటమరాయుడు చిత్రం అనుకున్న సమయంలో పూర్తవుతుందా లేదా అనే అయోమయంలో పడ్డాడట దర్శకుడు డాలీ. కాటమరాయుడుతోపాటు ఎ.ఎం.రత్నం సినిమా, త్రివిక్రమ్ సినిమాలకు కమిట్ అయ్యాడు పవన్. మరి ఈ సినిమా షూటింగ్‌లు అనుకున్న సమయంలో పూర్తిచేస్తాడో లేదో అని మెగా ఫ్యాన్స్‌లో సందేహం నెలకొంది.