సత్యహరిశ్చంద్ర పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సత్యహరిశ్చంద్ర’ పద్య నాటకం నాటినుంచి నేటివరకూ అందరినీ అలరిస్తూనే వుంటుంది. ఈ నాటకం తాజాగా అదే పేరుతో సినిమాగా రూపొందింది. ప్రముఖ రంగస్థల నటి మంగాదేవి ఇందులో సత్యహరిశ్చంద్ర పాత్రలో నటించడం విశేషం. మోరల్ ప్రొడక్షన్స్ పతాకంపై రంగస్థల నటుడు వై.గోపాలరావు దర్శకత్వం వహించగా కొత్తపల్లి సీతారాము నిర్మించారు. వీణాపాణి శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీ పార్వతి సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కోడి రామకృష్ణ, గుమ్మడి గోపాలకృష్ణ, జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంగాదేవి మాట్లాడుతూ- నేను సత్యహరిశ్చంద్ర పాత్ర చేయాలన్నది నాన్నగారి కోరిక. ఆయన ప్రోత్సాహంతోనే చిన్నప్పుడు నాటకాల్లో చేరాను. పద్యాలు పాడటం నేర్చుకున్నాను. హరిశ్చంద్ర పాత్రను అత్యధికసార్లు ప్రదర్శించాను. ఇప్పుడు ఈ నాటకం పూర్తి స్థాయిలో సినిమాగా రావడం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాత సీతారాము మాట్లాడుతూ- మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు నాటకాలు. యువతరం నాటకాల ప్రాముఖ్యాన్ని గుర్తించాలి. ఆదరణ కోల్పోతున్న ఈ రంగాన్ని కాపాడుకోవాలి. ఆ నేపథ్యంలో మేము చేసిన ప్రయత్నమే ఈ సినిమా. సత్యహరిశ్చంద్ర నాటకంలో సత్యం పలకాలి, నిజాయితీగా వుండాలని ఇప్పటి తరానికి తమ సందేశాన్ని అందిస్తున్నాం అన్నారు. నటుడు జె.పి మాట్లాడుతూ- ఈ సినిమాలో అద్భుతంగా పద్యాలు పాడారు. నాటక రంగానికి ప్రేక్షకులు తగ్గిపోయారు. పద్యాలు మన తెలుగు జాతి సంపద. మా నాన్నగారు నాటకాల్లో పద్యాలు పాడేవారు. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్న కళాకారులకు అభినందనలు అన్నారు. దర్శకుడు గోపాలరావు మాట్లాడుతూ- ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా:పోతిన ఓంప్రకాష్, పర్యవేక్షణ:పశుమర్తి రామలింగేశ్వరరావు.