ఆదిలాబాద్‌లో బంజారా టైగర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి9 ఫిలిమ్స్ పతాకంపై సలీమ్, పాఠక్ హీరో హీరోయిన్లుగా ఫరుూమ్ సర్కార్ దర్శకత్వంలో సమీనా యాస్మిన్ నిర్మాతగా ‘బంజారా టైగర్స్’ చిత్రం ఆదివారం ఆదిలాబాద్ మెయిన్ సెంటర్ అంబేద్కర్ చౌక్‌లో అత్యంత భారీ జన సందోహం మధ్యలో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి తొలి షాట్‌కి సలీమ్, పాఠక్, ప్రసన్నకుమార్, జబర్దస్త్ అప్పారావులపై తెలంగాణ మంత్రి జోగురామన్న క్లాప్‌నివ్వగా, ఆదిలాబాద్ ఏంఎల్‌ఏ రేఖనాయక్ కెమెరా స్విచాన్ చేసారు. తొలి షాట్‌కి శ్యాంనాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఫరుూమ్ సర్కార్ మాట్లాడుతూ... మా ‘బంజారా టైగర్స్’ మూవీ ఇంత భారీగా ఓపెనింగ్‌జరుపుకోవటం ఆనందంగా ఉందని, నలుగురు యువకులు జల్సాగా తిరుగుతూ అనుకోకుండా నక్సలైట్ ముద్రతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి ఊరికి ఏమి చేసారు, ఊరు మనకేమి ఇచ్చింది కన్నా ఊరుకి మనమేమి చేసాం అనే కానె్సప్ట్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం ఈరోజు నుండి 15 రోజుల పాటు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసి సెకండ్ షెడ్యూలు డిసెంబర్‌లో హైదరాబాద్ పాటలను వైజాగ్, కాశ్మీర్‌లో చిత్రీకరిస్తున్నామన్నారు. నిర్మాత సమీనా యాస్మిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని నాగునాయక్ సంగీత సారధ్యంలో రికార్డింగ్ పూర్తిచేశామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందన్నారు. నటుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఓపెనింగ్ చూడటం ఇదే అన్నారు.