గోవాలో చిన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక, బేబీ యులీనా పార్థవి ప్రధాన తారాగణంగా కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై సంయుక్తంగా లోహిత్ దర్శకత్వంలో కె.రవికుమార్, ఎమ్.ఎమ్.ఆర్ అందిస్తున్న చిత్రం చిన్నారి. తెలుగు,కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం ఈనెల 25న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు లోహిత్ మాట్లాడుతూ హారర్ జోనర్‌లో వైవిధ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, తల్లీ కూతురు సెంటిమెంట్ ఈ చిత్రంలో ఉంటుందని, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించిందని అన్నారు. హారర్ చిత్రంగా రూపొందిన చిన్నారిలో చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుందని, గోవా నేపథ్యంలో కథ జరుగుతుందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, హాలీవుడ్ స్టయిల్ టేకింగ్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, 25న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం: లోహిత్.