భారీ మల్టీస్టారర్ ? ముగ్గురు హీరోలు ఓకె.. మరో ఇద్దరి కోసం యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తెలుగులో మళ్లీ మల్టీస్టారర్ సినిమాల హవా బాగానే ఉంది. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమాతో ఇద్దరు స్టార్ హీరోలు ఈ మల్టీస్టారర్ సినిమాలకు తెరలేపారు. ఆ తరువాత అలాంటి సినిమాలు రూపొందుతున్నాయి కూడా. అయితే ఇప్పుడు ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా రానుంది. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోలు నటిస్తారట! అవును.. వింటనే షాకింగ్‌గా వుందా.. ఆ వివరాల్లోకి వెళితే.. ఆమధ్య సుధీర్‌బాబు హీరోగా ‘్భలే మంచిరోజు’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసిన శ్రీరామ్ ఆదిత్య ఓ సూపర్ కథను రెడీ చేశారని తెలిసింది. ఈ సినిమాలో ఐదుగురు హీరోలు ఉంటారని, ఇప్పటికే ఆ హీరోలకు కథలు వినిపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసా? నారా రోహిత్, నాగశౌర్య, సందీప్ కిషన్‌లకు కథ వినిపించి ఓకే చేయించాడట.. ఇక మిగిలిన ఇద్దరు హీరోలెవరో తెలియాలి.. తనకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన సుధీర్‌బాబు కూడా ఉండొచ్చు! అన్నట్టు ఈ ఐదుగురు హీరోల్లో ఒక సీనియర్ హీరో కూడా ఉంటాడట! మరి ఆ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఐదుగురు హీరోలతో శ్రీరామ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.