ప్రేమమ్ దర్శకుడితో నాగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా.. దాన్ని అట్టే పట్టేయడం నాగార్జున స్పెషాలిటీ. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకున్న నాగార్జున ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వేంటేశాయ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి చివర్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత నాగార్జున తన నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. లేటెస్టుగా ‘ప్రేమమ్’ విజయంతో మంచి జోరుమీదున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇదివరకే చందు నాగార్జునకు కథ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. నిఖిల్‌తో కార్తికేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చందు మొండేటి... తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. నాగార్జునకు కథ చెప్పిన ఈ దర్శకుడు రవితేజ, ఎన్టీఆర్‌లకు కూడా కథలు చెప్పాడని తెలుస్తోంది. ఇంకా వారు ఓకె చెప్పాల్సి ఉంది.