ఐదుగురు హీరోయన్లతో చిన్నవాడు.... హీరో నిఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితుల్లో ‘స్వామిరారా’ సినిమానుంచి తన ప్రతి సినిమాకూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ వస్తోన్న యువ హీరో నిఖిల్, తాజాగా తన కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ను విడుదలకు సిద్ధం చేశారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా గురించి నిఖిల్ చెప్పిన విశేషాలు..

పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్ ఉంటుందేమో
నా ప్రతి సినిమా విడుదలప్పుడూ నేను బాగా టెన్షన్ పడుతుంటా. ఈసారి కరెన్సీ బ్యాన్‌వల్ల సినిమాల కలెక్షన్స్ తగ్గడం ఇంకొంచెం భయపెడుతోంది. అయితే ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం.
సినిమా గురించి
వి.ఐ.ఆనంద్ నాకు ఈ కథ చెప్పగానే బాగా ఎగ్జైట్ అయ్యా. మంచి లవ్‌స్టోరీతోపాటు సినిమా మొత్తం కొత్తగా అలరించే ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు వుంటారు. ఇంకా అందరి పేర్లూ రివీల్ చేయలేదు. కథ ప్రకారంగా ఆ పాత్రలన్నీ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్సే!
రోల్ గురించి
‘బాహుబలి’ సినమాకు పనిచేసే ఓ గ్రాఫిక్ డిజైనర్‌గా ఈ సినిమాలో కనిపిస్తా. నా రోల్‌లో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకసారి సినిమాటోగ్రాఫర్ అందుబాటులో లేకపోవడం, ఒకసారి హీరోయిన్ కోసం ఎదురుచూడడం ఇలా అనుకోని కారణాలు కూడా కలిసి మా సినిమా కొంత ఆలస్యమైంది.
ప్రమోషన్ ఇన్‌వాల్వ్‌మెంట్
ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక ఇంక క్రియేటివ్ సైడ్ నేనస్సలు జోక్యం చేసుకోను. అదంతా దర్శకుడికే వదిలేస్తా. సినిమా ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం నాదైన ప్లాన్ ఒకటి తీసి, అన్ని విధాలా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని అనుకుంటూంటా. ఈ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గను.
కొత్తదనమున్న సినిమా
నా అదృష్టంకొద్దీ గత కొన్ని సంవత్సరాలుగా నా సినిమాలంటే కొత్తగా ఉంటాయన్న మార్క్ వచ్చేసింది. దాన్ని నిలబెట్టుకునే దిశగానే స్క్రిప్ట్స్ కోసం చూస్తూంటా. ఇందుకోసమే కాస్త ఆలస్యమైనా మంచి సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నా.
ప్రస్తుత సినిమాలు
ప్రస్తుతానికి సుధీర్ వర్మతో చేస్తోన్న సినిమా సెట్స్‌పై వుంది. అది పూర్తవ్వగానే చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చే ఏడాది ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా.

-శ్రీ