హాట్ సాంగ్‌తో అనసూయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టెలివిజన్ రంగంలో యాంకర్‌గా హాట్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది అనసూయ. జబర్దస్త్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు.. అటు సినిమాల్లో కూడా నటిస్తోంది. మరోవైపు అనసూయకు ఐటెం సాంగ్స్ చేయమని తెగ ఆఫర్స్ వస్తున్నాయట. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చినా కూడా నో చెప్పింది. మామకు నో చెప్పి అల్లుడి సినిమాలో ఐటెం సాంగ్‌కు ఓకె చెప్పి షాక్ ఇచ్చింది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘విన్నర్’ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇటీవలే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా జరిపారు. ‘అనసూయ... అనసూయా’ అంటూ సాగే పల్లవితో ఈ పాట ఉంటుందట! గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనసూయ సాంగ్ సినిమాకే హైలెట్ అని యూనిట్ భావిస్తోంది. మరి ఈ సాంగ్‌తో అనసూయ.. టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు!