తెలుగు నేర్చుకుంటున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు నేర్చుకుంటారు కానీ ఆదాశర్మ హిందీ సినిమా ఛాన్స్ కోసం తెలుగు నేర్చుకుంటోంది. మీరు విన్నది నిజమే. హిందీ సినిమా కోసం హిందీ వస్తే సరిపోతుందిగా? అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ. పూరి దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్‌ఎటాక్’ సినిమాతో బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి పరిచయం అయింది ఆదాశర్మ. ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి చాలా సినిమా అవకాశాలే వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా తన కెరీర్‌కి సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దాంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం హిందీలో రూపొందుతున్న ‘కమాండో-2’ సినిమాలో నటిస్తున్న ఈ భామ, ఇప్పుడు తెలుగు నేర్చుకుంటోంది ఎందుకో తెలుసా? ఈ సినిమాలో హీరోయిన్ తెలుగమ్మాయి. విజయవాడనుండి ముంబై వచ్చిన యువతి పాత్రలో నటిస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ హిందీ కూడా బట్టీ పట్టేస్తుంది. దేవం భోజాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మళ్లీ తనకు మంచి క్రేజ్ దక్కడం ఖాయం అని అంటోంది ఆదాశర్మ! అన్నట్టు ఈ సినిమాలో హీరోగా విద్యుత్ జమ్మవాల్ నటిస్తున్నాడు.