సాయిధరమ్‌తో గౌతమ్ మీనన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయిధరమ్‌తేజ్. ‘నక్షత్రం’ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటిస్తున్న సాయి ధరమ్ మరో క్రేజీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దక్షిణాదిలో ట్రెండ్ క్రియేట్ చేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్ మీనన్. ఆయన సినిమాలంటే ప్రేక్షకులకు చాలా ఆసక్తి. ముఖ్యంగా ప్రేమకథల్ని కొత్తగా డీల్ చేయడంలో ఆయన శైలే వేరు. ఇప్పుడు గౌతమ్‌మీనన్ సాయిధరమ్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే తెలిపాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమవుంతోందని, త్వరలోనే తేజ్‌కు వినిపించి ఓకె చేయిస్తానని అంటున్నాడు. గౌతమ్ సినిమాతో సాయిధరమ్‌కు మరింత క్రేజ్ దక్కడం ఖాయం. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్’ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే గౌతమ్-సాయిధరమ్‌ల సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం వుంది.