డిసెంబర్‌లో శాతకర్ణి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్రలో గొప్ప కీర్తిని గడించిన శాతకర్ణి రాజు జీవిత కథగా తెరకెక్కుతోంది. శ్రీయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటీమణి హేమమాలిని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే బాలకృష్ణ, శ్రీయలపై ఫిలింసిటీలో ఓ పాటను చిత్రీకరించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను డిసెంబర్ మొదటివారంలో విడుదల చేస్తారట. రెండవ వారంలో పాటలని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోనుంది.