సెన్సార్‌లో ఇదేనా ప్రేమ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్నమల్ల ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సుప్రీమ్, పావని జంటగా కిషన్ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా..!’ ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో సుప్రీమ్ మాట్లాడుతూ, విచక్షణ అనే చిత్రంలో సెకెండ్ హీరోగా నటించాను. సోలో హీరోగా చేస్తోన్న తొలి చిత్రమిది. దర్శక నిర్మాత కిషన్ నేను మంచి మిత్రులం. నామీద నమ్మకంతో ఈ సినిమా చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. అనీష్ దర్బారి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత కిషన్ కన్నయ్య మాట్లాడుతూ, ఇదొక యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ. మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తిచేశాం. కథ మీద నమ్మకంతో నేనే నిర్మించాను అన్నారు. వరుణ్ అల్వా, వెంకట్, అప్పలనాయుడు, పెన్నా మోహన్ శర్మ, దివాకర్ శర్మ నటించిన ఈ చిత్రానికి సంగీతం:అనీష్ దర్బారి, కెమెరా:కారె సతీష్, ఎడిటర్:ఈశ్వర్, సమర్పకులు:లయన్ సాయి వెంకట్, నిర్మాత, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కిషన్ కన్నయ్య.