వైశాఖం నచ్చుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయ.బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
దర్శకురాలు జయ.బి మాట్లాడుతూ- ‘్ఫ్యమిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే మంచి సినిమాగా వైశాఖం రూపొందుతోంది. ‘లవ్‌లీ’ తర్వాత మళ్లీ సూపర్‌హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా వైశాఖం. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మిక్స్ అయిన వైశాఖం ఆపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్‌గా పెద్ద హిట్ రేంజ్‌కి వెళుతుంది. కజకస్థాన్‌లో తీసిన సాంగ్స్ ఈ చిత్రానికి హైలెట్ అవుతాయి. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో వుంది. ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్‌కి సంబంధించిన వర్క్ జరుగుతోంది’ అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ చిత్రాలు జయకి డైరెక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చాయి. అంతేకాకుండా మంచి కమర్షియల్ హిట్స్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ వైశాఖం. జయ దర్శకత్వంలో సినిమా అనగానే బయ్యర్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. హైటెక్నికల్ వేల్యూస్‌తో తీస్తున్న వైశాఖం మా బేనర్‌లో వచ్చిన లవ్‌లీకి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్ వుంది. హిందీ, తమిళ రైట్స్ కోసం కూడా ఆఫర్స్ రావడం ఈ సినిమా మీద వున్న క్రేజ్‌కి నిదర్శనం’ అని అన్నారు. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.