హసీనాగా శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ కుటుంబ సభ్యులను కలవడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. దావూద్ సోదరి హసీనాకు సంబంధించి కథతో బాలీవుడ్‌లో ‘హసీనా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హసీనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. దీనికి సంబంధించిన వివరాల కోసం దావూద్ కుటుంబ సభ్యులను శ్రద్ధాకపూర్ కలసింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఆమె హోంవర్క్ చేస్తోంది. ఇందుకోసం హసీనా ఇంటికి వెళ్లి గతంలో వారు ఉపయోగించిన అనేక వస్తువుల గురించి తెలుసుకుంటోందట. ఇందులో భాగంగా హసీనాకు, దావూద్ బహుకరించిన ముక్కుపుడుకను కూడా ఆమె తీసుకుందట. దావూద్ కుటుంబ సభ్యులుకూడా ఆమెకు సహకరిస్తున్నారని శ్రద్ధ చెబుతోంది. హసీనా నిర్వహిస్తున్న ‘స్లమ్ డెవలప్‌మెంట్ అథారిటీ డీలింగ్స్’ గురించి కూడా ఈ సినిమాలో చూపిస్తారు. ఇందుకోసం మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి దావూద్ కుటుంబంతో ఈ డిసెంబర్‌లో మరోసారి ఆమె కలసి చర్చలు జరుపుతుందని తెలిసింది. ఈ సినిమాలో శ్రద్ధ సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా నటిస్తున్నాడు. విశేష్ ఏమిటంటే, ఈ చిత్రంలో సిద్ధాంత్ దావూద్ పాత్రలో నటిస్తుండటం. ఈ సినిమా విడుదలైనాక ఎన్ని సంచలనాలు, వివాదాలకు తెరతీస్తుందో వేచిచూడాలి.