విక్రమార్కుడు సీక్వెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శక ధీరుడు రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కథ అందించిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. రవితేజ హీరోగా నటించే ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ప్రస్తుతం రాజవౌళి ‘బాహుబలి-2’ సినిమాలో బిజీగా వున్నాడు కాబట్టి ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించే అవకాశం లేదు. అందుకే విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తారని తెలిసింది.