మెసేజ్‌తో ఒక్కడొచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై యువ నిర్మాత జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. సురాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నెలలోనే విడుదలకావలసిన ఈ చిత్రం ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జి.హరి మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని పెద్ద నోట్ల రద్దుతో వాయిదా వేయడం జరిగిందని, వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపారు. విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలుస్తుందని తెలిపారు. తమన్నా పాత్ర హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం యూత్‌తోపాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన అన్నారు. జగపతిబాబు, సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:హిప్ హాప్ తమిళ, కెమెరా:రిచర్డ్ ఎం.నాథన్, మాటలు:రాజేష్ ఎ.మూర్తి, పాటలు:చల్లా భాగ్యలక్ష్మి, ఎడిటింగ్:ఆర్.కె.సెల్వ, నిర్మాత:జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సురాజ్.