యూనివర్సల్ ప్రేమకథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజయ్, చేతనా ఉత్తేజ్, కారుణ్య హీరో హీరోయిన్లుగా శశిభూషణ్ దర్శకత్వంలో శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్.రామారావు క్లాప్‌నివ్వగా, తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు శశిభూషణ్ మాట్లాడుతూ- ప్రేమ అనేది యూనివర్సల్. అయితే ప్రతి మనిషి ప్రేమకు తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటాడు. ప్రేమ అన్నది ఎవరి వ్యక్తిగతం వారిది. ఒక అమ్మాయిని ప్రేమించిన కుర్రాడు, తను చేసిన తప్పులు తెలుసుకుని కెరీర్‌తోపాటు అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నాడనే కథతో ఈ చిత్రం సాగుతుంది. నాగబాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాపై మంచి నమ్మకం వుంది అన్నారు. నిర్మాత కమల్‌కుమార్ మాట్లాడుతూ- కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాన్ని నిర్మించాలని ఈ బ్యానర్‌ని ప్రారంభించాం. శశి చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా ప్రారంభిస్తున్నాం. సంక్రాంతి తరువాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మరో షెడ్యూల్‌లో పాటలను చిత్రీకరిస్తాం. అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలలోపాటు కేరళ, కర్నాటకలలో షూటింగ్ జరపనున్నాం అన్నారు. హీరో సంజయ్ మాట్లాడుతూ- వెల్‌కమ్ ఒబామా సినిమా తరువాత నేను చేస్తున్న మూడవ సినిమా ఇది. కథ బాగా నచ్చింది. ఇంత మంచి చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ- ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:వెంకట హనుమ, సంగీతం: రామ్‌నారాయణ, ఆర్ట్:రమేష్, నిర్మాత: కమల్‌కుమార్ పెండెం, దర్శకత్వం: వి.వి.శశిభూషణ్.