డేటింగ్ చేశా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లికి ముందు డేటింగ్ చేయడం తప్పని అందరూ అనుకుంటారు. కానీ అలా గమనిస్తేనే కాబోయే భర్తకు సంబంధించిన విషయాలను గుర్తించవచ్చు. నచ్చితేనే పెళ్లి, లేదంటే నచ్చినవాణ్ని వెతుక్కోవటమే అని చెబుతోంది అందాల నటి విద్యాబాలన్! పెళ్లై సంసార జీవితం గడుపుతున్న ఈ అమ్మడు ఇప్పుడు డేటింగ్ గురించి చెప్పటం ఏమిటా? అని అనుకోకండి. ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో విద్యాబాలన్‌కు సాటి ఎవరూ లేరు. పెళ్లయ్యాక ఒకవేళ డేటింగ్ చేసినా ఆ విషయాన్ని చెప్పకుండా మిగతా విషయాలను మాట్లాడే కొంతమంది హీరోయిన్లకు మినహాయింపుగా విద్యాబాలన్ కనిపిస్తోంది. పెళ్లయ్యాక ఇనే్నళ్లయ్యాక తన డేటింగ్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది. సిద్ధార్థరాయ్ కపూర్‌ను పెళ్లాడకముందు తాను కొందరితో డేటింగ్ చేసిన మాట నిజమేనని కుండ బద్దలు కొట్టింది. అయితే, వారి అభిరుచులు నచ్చకపోవడంతో దూరమయ్యానని, ఆ తరువాత పెళ్లి లేకుండా ఒంటరి జీవితం గడిపేయాలనుకున్నానని అంటోంది. నిర్మాతగా పరిచయమైన సిద్ధార్థతో మూడేళ్లు డేటింగ్ చేశాక పెళ్లిచేసుకున్నామని, తమది మెచ్యూర్డ్ లవ్ అని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా పెళ్లయ్యాక తన భర్త ఏమనుకుంటాడో అన్న ఆలోచన లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన విద్యాబాలన్ నిజంగా చాలా బోల్డ్ కదూ!