నేను శైలజ ప్రేక్షకులకు నచ్చాం --- హీరో రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ‘నేను శైలజ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో హీరో రామ్ మాట్లాడుతూ- దేవదాసు సినిమా తప్పించి మిగతా నా సినిమాల్లో అన్ని కామెడీకి పెద్దపీట వేసిన సినిమాలే. సాఫ్ట్ కేరెక్టర్‌తో చేసిన గణేష్ మంచి విజయాన్ని అందుకోలేదు. దాంతో మాస్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను. కందిరీగ పెద్ద హిట్ అయింది. మొదటిసారి మాస్ ఇమేజ్‌ని పక్కనపెట్టి క్యూట్ లవ్‌స్టోరీతో ఈ సినిమా చేశాను. ఈ బాధ్యత మొత్తం దర్శకునికే అప్పగించాను. ఆయన చాలా కేర్ తీసుకుని నా పాత్రను మలిచారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్టు అవుతున్నారు ఈ సినిమాకు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ- నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. సెన్సిటివ్ పాయింట్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కిషోర్ అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ- రెగ్యులర్ సినిమాల్లా కాకుండా రియలిస్టిక్‌గా వుండాలని జాగ్రత్తలు తీసుకుని ఈ కథ చేశాం. మేము ఊహించినట్టుగా సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ- ఈ సినిమాలో రామ్ కన్పించలేదు. కేవలం హరి అనే పాత్ర మాత్రమే కన్పడింది. ఈ బ్యానర్‌లో ఎప్పుడూ మంచి చిత్రాలే వస్తాయి అన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ- కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేస్తే ఎలా వుంటుందనేది ఈ సినిమా రుజువుచేసింది అన్నారు.