బ్యాడ్‌టైంలో లేడీఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జరీన్‌ఖాన్ గుర్తుందిగా.. అలా అనేకంటే లేటెస్టుగా ‘హేట్‌స్టోరీ-3’లో బ్రాతో అందాలు హాట్ హాట్‌గా ఆరబోసి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు ఆ సినిమా తరువాత అచ్చం అలాంటి అవకాశాలే వస్తున్నాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ ‘వాజహ్ తుమ్ హూ’లో ఓ హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసింది. అందాలు ఆరబోసి పోల్ డాన్స్ చేసినా ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఈ సాంగ్ చూసిన వాళ్లు సూపర్ అన్నారు కానీ ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి మాత్రం అవకాశాలు రావడంలేదట. హాట్ హీరోయిన్ నుండి ఐటెం గర్ల్‌గా మారినా ఈ లేడీఖాన్‌కు ఇంకా కాలం కలిసి రాలేదేమిటో?!